తెలంగాణవీణ జాతీయం : ‘తమిళ్ రాకర్స్’ పైరసి గ్రూప్ అడ్మిన్‌ని కేరళలో పోలీసులు అరెస్టు చేశారు. మదురైకి చెందిన జెఫ్ స్టీఫన్‌రాజ్ థియేటర్లలతో కొత్తగా విడుదలయ్యే సినిమాలను పైరసీ చేసి అక్రమంగా వెబ్‌సైట్‌ల్లో విడుదల చేస్తున్న ‘తమిళ్ రాకర్స్’ అడ్మిన్. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని థియేటర్‌లో నటుడు ధనుష్ ‘రాయన్’ సినిమాను సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుండగా ఆదివారం అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో 12 మంది కలిసి పనిచేస్తున్నట్లు తెలిసింది. నటుడు పృథ్వీరాజ్ నటించిన ‘గురువాయూర్ అంబలనడైయిల్’ అనే మలయాళ సినిమా గత మే నెలలో విడుదలవగా మొదటి రోజే తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో పెట్టారు. అనంతరం పృథ్వీరాజ్ భార్య సుప్రియ ఫిర్యాదు మేరకు కొచ్చి సైబర్ క్రైం పోలీసులు చర్యలు చేపట్టారు. తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా టెలిగ్రామ్‌లో కూడా అతను సినిమాలను విడుదల చేస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన జెఫ్ స్టీఫన్‌రాజ్‌ను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.