తెలంగాణవీణ ఏపీ బ్యూరో : తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ దిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని పీవీకి భారతరత్నపై స్పందించమని జగన్‌రెడ్డిని జాతీయ మీడియా కోరితే.. విజయసాయిరెడ్డి పేరు చెప్పి వెళ్లిపోయారని గుర్తు చేశారు. రెడ్ బుక్ విషయంలో మాత్రం జాతీయ మీడియాను బతిమాలి పిలిపించుకుని ప్రచారం కల్పించారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రెండు ప్రెస్‌మీట్లు పెట్టిన జగన్.. 11 సీట్లు వచ్చిన నెలలోపే ఐదు ప్రెస్‌మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అసత్యాలకు.. అసెంబ్లీకి వస్తే