తెలంగాణవీణ సినిమా : ఇంటర్నెట్ డెస్క్: రామ్ పోతినేనిపూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ కావ్యా థాపర్ కథానాయిక. ఆగస్టు 15న ఈ మాస్ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల దీనినుంచి ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ అనే మాస్ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్ దాన్ని ఆలపించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు వీళ్లిద్దరూ పంచుకున్నారు. మీకు, పూరి జగన్నాథ్‌కు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పండి?మణిశర్మ: మా ఇద్దరి కాంబినేషన్‌లో చాలా విభిన్నమైన పాటలు వచ్చాయి. పోకిరిలోని ‘డోలె డోలె’, ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’లోని పాటలు, పవన్‌కల్యాణ్ సినిమాలోని ‘మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో’ వంటి పాటలు హిట్‌గా నిలిచాయి. పూరీ జగన్నాథ్ పాట కాన్సెప్ట్‌ను ఐదు నిమిషాల్లో చెప్పేస్తారు. నాకు పూర్తి స్వేచ్ఛనిస్తారు. ‘ఇస్మార్ట్ శంకర్’లో వచ్చిన ‘దిమాక్ ఖరాబ్’ను ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ పాట మరిపించాలని చెప్పారు. చాలా కష్టమనుకున్నాను. 2 రోజులు ఆలోచించా. చివరకు షాపింగ్‌కు వెళ్తూ ట్యాక్సీలో ఓ ట్యూన్ విన్నా. అలా ఈ పాట ప్రయాణం మొదలైంది. అది సంచలనం సృష్టించింది. కొన్ని వింతలు మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. వాటిని మనం ఎంజాయ్ చేయాలంతే.ఈ పాటలో మీ ఆలోచనలను బట్టి మార్పులు చేశారా?మణిశర్మ: చాలామంది ఈ పాటను ఐటెమ్ సాంగ్ అనుకుంటున్నారు. కానీ, ఇది డ్యూయెట్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ఆధారంగా దీని లిరిక్స్ రాశాం. కేసీఆర్ గారంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన సరదాగా చెప్పిన ఓ పదాన్ని ఇందులో తీసుకున్నామంతే. ఎవరినీ నొప్పించడం మా ఉద్దేశం కాదు. నా 27 ఏళ్ల కెరీర్‌లో నేను ఎవరినీ నొప్పించలేదు. ఈ పాటలో కేసీఆర్‌ను ఒకసారి తలచుకున్నాం. దయచేసి అలానే అందరూ భావించండి. ఇది కేవలం వినోదం కోసమే.‘ఇస్మార్ట్ శంకర్’కు ‘డబుల్ ఇస్మార్ట్’కు మధ్య పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయా?మణిశర్మ: అలాంటివి ఏమీ ఉండవు. మన పనిని మనం 100శాతం పూర్తి చేయాలి. పాటకు సంబంధించిన ఐడియా వచ్చినప్పుడే సంబరాలు మొదలవుతాయి. అది హిట్ అయితే అవి రెట్టింపవుతాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ గురించి ఒక్క మాటలో చెప్పండి?మణిశర్మ: మాటల్లేవ్. మనందరం మన శక్తిమేర అద్భుతంగా పని చేశాం. ఇంకా మూడు పాటలు ఉన్నాయి.