తెలంగాణవీణ, క్రీడలు : టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ జాబితాలో సూర్య రెండో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. 13 స్థానాలు మెరుగుపరుచుకొని రుతురాజ్ గైక్వాడ్ ఏడో ర్యాంకు సాధించాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అక్షర్ పటేల్ 9, కుల్దీప్ యాదవ్ 11, బుమ్రా 14వ స్థానాల్లో కొనసాగుతున్నారు.