హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు, రాజ్ తరుణ్‌కు అక్రమ సంబంధం ఉంది.
నేను ఆరోపణలు చేసిన ప్రతిదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
రాజ్ తరుణ్, నేను ఏడేళ్లు పాటు కలిసి సంసారం చేసాం.. ఎలాగైన నన్ను వదిలించుకోవాలని ఉద్దేశంతోనే రాజ్ నా పై ఆరోపణలు చేస్తున్నాడు.
వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. డ్రగ్స్ కేసులో మస్తాన్ నా ఫ్రెండ్ కావడంతో ఈ కేసులో నన్ను ఇరికించారు.
మా జీవితాల నుండి మాల్వి మల్హోత్రా వెళ్లిపోవాలి.. ఈ వ్యవహారంలో నేను న్యాయపోరాటం చేస్తాను.
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు నా పై బెదిరింపులకు దిగారు.. మస్తాన్ సాయి అనే వ్యక్తితో నాకు అక్రమ సంబంధం అంటగట్టారు.
మేము గతంలో ఓ గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నాము.. మాల్వీ లైఫ్ లోకి వచ్చాక నన్ను అవాయిడ్ చేస్తున్నాడు.
నేను డ్రగ్స్ తీసుకొని ఫ్లాట్ కు వచ్చేదాన్ని అనే మాటలు అవాస్తవం.
ఇప్పటికీ నేను రాజ్ తరుణ్ తోనే కలిసి జీవించాలనుకుంటున్నాను.. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా వ్యవహారంలో సినీ పెద్దలకు ఫిర్యాదు చేస్తాను.
నేను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.
నేను నార్సింగ్ పోలీసులకు ఆధారాలన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను.. నేను ఆరోపణ చేసిన ప్రతిదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
నాకు ప్రాణ హాని ఉంది నన్ను కాపాడాలని పోలీసులను కోరుతున్నాను – లావణ్య