Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్‌ల వైవాహిక బంధానికి తెరపడింది..

Must read

తెలంగాణవీణ సినిమా : టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్‌ల వైవాహిక బంధానికి తెరపడింది. తాము విడాకులు తీసుకోనున్నట్లు హార్దిక్‌, నటాషా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. గత కొంత కాలంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నటాషా కుమారుడు అగస్త్యను తీసుకొని ఇటీవల ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబయి విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ‘‘4 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేం కలిసి ఉండేందుకు మా వంతుగా అన్ని విధాలుగా ప్రయత్నించాం. ఈ నిర్ణయం మా ఇద్దరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నాం. మా అనుబంధాన్ని తెంచుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నాం. కుమారుడు అగస్త్య బాధ్యతను తల్లిదండ్రులుగా ఇద్దరం చూసుకుంటాం. ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సామాజిక మాధ్యమాల్లో హార్దిక్, నటాషా పోస్ట్‌ పెట్టారు. 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో పాండ్య.. సెర్బియా నటి అయిన నటాషా చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భిణి అని సోషల్‌మీడియాలో పెట్టినప్పుడే అతడికి పెళ్లైందని తెలిసింది. అదే ఏడాది జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అప్పుడు కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్‌ పద్ధతుల్లో వివాహమాడారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you