Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రైతులకు గుడ్ న్యూస్ రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు..

Must read

తెలంగాణవీణ హైదరాబాద్ : రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. 70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్‌కార్డులు లేవు. వారికీ రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్‌కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వం. రుణమాఫీ జరిగే రైతులను రైతువేదికల వద్దకు తీసుకొచ్చి.. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో ఆ సంతోషం పంచుకోవాలి. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది. అదేరోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు జరపాలని నిర్ణయించింది. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్‌కార్డు నిబంధన విధించినట్లు మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రుణమాఫీపై సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో.. రేషన్‌కార్డు నిబంధనపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి తాజాగా స్పష్టత ఇచ్చారు.ఇతర ఖాతాల్లో జమ చేయొద్దు.. ‘‘రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకం. దీని అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఏ ఒక్క రైతుకూ నష్టం జరగొద్దు. ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి. అదేరోజు సాయంత్రం సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలి. వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దు. గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేమూ ఇప్పుడు అలాగే చేస్తాం’’ అని సీఎం పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో ఆయన ఆదేశించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you