తెలంగాణవీణ సినిమా : ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. టీమ్‌ను మెచ్చుకుంటూ పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే తమ చిత్రాన్ని ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పారు ధనుష్. తమ సినిమా సక్సెస్‌పై ఆనందం వ్యక్తంచేస్తూ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘‘మా చిత్రానికి విజయాన్ని అందించిన సినీ ప్రేక్షకులు, ఆత్మీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై అమితమైన ప్రేమ చూపించి, నాకు అండగా నిలబడుతున్న అభిమానులకు థ్యాంక్యూ. ఇప్పటివరకూ నేను అందుకున్న ది బెస్ట్ బ్లాక్‌బస్టర్ బర్త్‌డే గిఫ్ట్ ఇదే’’ అని తెలిపారు.నటుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లారెన్స్ తాజాగా ‘రాయన్’ వీక్షించారు. ‘‘నిన్న ‘రాయన్’ చూశా. ధనుష్ దర్శకత్వం, యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఎస్.జె.సూర్య పాత్ర చిత్రీకరణ విభిన్నంగా ఉంది. దుషారా విజయన్‌తోపాటు ప్రతిఒక్కరూ చక్కగా వర్క్ చేశారు. ఎ.ఆర్.రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అత్యద్భుతంగా ఉంది. స్క్రీన్‌ప్లేతోపాటు చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయం నన్నెంతో ఆకట్టుకుంది. మన ఇండస్ట్రీలో ఉన్న ఇంటర్నేషనల్ రేంజ్ డైరెక్టర్ మనకు దొరికాడు’’ అని ప్రశంసించారు.ధనుష్ నటించిన 50వ చిత్రమిది. యాక్షన్ క్రైమ్ ఫిల్మ్‌గా ఇది రూపుదిద్దుకుంది. అపర్ణా బాలమురళీ, సందీప్ కిషన్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వారాంతపు ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలుచేసినట్లు చిత్రబృందం తెలిపింది.