తెలంగాణవీణ ఏపీ బ్యూరో : గత ఐదేళ్లలో వైకాపా నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో సహజవనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైకాపా హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు.
‘‘కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైకాపా నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్రపన్నారు.’’ అని చంద్రబాబు మండిపడ్డారు.