గ్రామ గ్రామన అభివృద్ధి పనులకు భూమి పూజలు
తెలంగాణ వీణ, మేడ్చల్ : గ్రామ గ్రామన అభివృద్ధి కార్యక్రమాలతో శామీర్ పేట్ మండలంలో బుధవారం పండగ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ నిధులతో ఎంపీపీ ఎల్లుభాయి బాబు, సాయిబాబా శామీర్ పెట్ గ్రామంలో బాబు జగ్జీవన్ రావ్ కమ్యూనిటీ హాల్ దగ్గర కొత్త నీల ట్యాంక్ కి కొబ్బరి కాయలుకొట్టి భూమి పూజ చేశారు. అదేవిధంగా అలియాబాద్ గ్రామంలోని మార్కండేయ ఆలయంలో ఎంపీటీసీ 1,2 నిధులతో బోరుబావి తవ్వించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీలు సాయి బాబా, అశోక్, శ్రీనివాస్, డైరెక్టర్ భూమి రెడ్డి, కుమార్, మాజీ వార్డు సభ్యులు ఉప్పలయ, బాబు ,మేడి రవి, శ్రీనివాస్, రమేష్, చిన్న బాబు, సాయి, మురళి,దాసు, తదితరులు పాల్గొన్నారు.