తెలంగాణవీణ జాతీయం : అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్ జులై 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ రోజుల్లో అనేక వస్తువులు తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, ట్యాబ్‌ల దగ్గరి నుంచి అన్ని వ్యక్తిగత ఎలక్ట్రానిక్ ఐటెమ్‌లు రాయితీ ధరలో ఉండనున్నాయి. బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి. స్పీకర్లు, స్ట్రీమింగ్ పరికరాల వంటి గృహోపకరణాలపైనా డిస్కౌంట్లు ఉండనున్నాయి.రాబోయే ప్రైమ్ డే సేల్ లో తమ బ్రాండ్‌తో వస్తోన్న స్మార్ట్ హోమ్ పరికరాలపై పెద్దఎత్తున రాయితీ ఇస్తున్నట్లు అమెజాన్ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫైర్ స్టిక్, అలెక్సాతో కూడిన ఎకో స్మార్ట్ స్పీకర్లు సహా అలెక్సా అనుసంధానిత స్మార్ట్ హోమ్ పరికరాలపై 55 శాతం వరకు రాయితీ లభిస్తున్నట్లు తెలిపింది.కస్టమర్లు అమెజాన్ ఎకో పాప్‌ను ఇప్పుడు రూ.2,499కే కొనుగోలు చేయొచ్చు. ఎకో షో 5 (2 జెన్) ఆఫర్ల తర్వాత రూ.3,999కే లభిస్తోంది. ప్రస్తుతం వీటి ధరలు భారత్‌లో వరుసగా రూ.3,999, రూ.8,999గా ఉన్నాయి. ఈ సేల్‌లో అమెజాన్ ఎకో షో 8 (2 జెన్) ధర రూ.13,999 నుంచి రూ.8,999కు తగ్గనుంది.అమెజాన్ కొన్ని ఉత్పత్తులపై కాంబో డీల్స్‌ను కూడా ప్రకటించింది. ఎకో డాట్ (5 జెన్)ను విప్రో 9W స్మార్ట్ బల్బ్‌తో కలిపి రూ.4,749కే కొనుగోలు చేయొచ్చు. క్లాక్‌తో కూడిన ఎకో డాట్ (4 జెన్), విప్రో 9W స్మార్ట్ బల్బ్ కలిపి రూ.3,749కు లభించనుంది. ఇదే బల్బ్‌తో కలిపి ఎకో పాప్‌ను రూ.2,749 వద్ద కొనొచ్చు. అమెజాన్ స్మార్ట్ ప్లగ్‌తో కలిపి విప్రో బల్బ్‌ను కొంటే రూ.2,948 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్రైమ్ డే సేల్‌లో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కనిష్ఠంగా రూ.2,199కు లభించనుంది. వాస్తవ ధర రూ.4,499తో పోలిస్తే 56 శాతం డిస్కౌంట్ ఉండనుంది. అలెక్సా వాయిస్ రిమోట్ లైట్‌తో కూడిన ఫైర్ టీవీ స్టిక్‌ను రూ.1,999కు పొందొచ్చు. అదే సమయంలో ఫైర్ టీవీ స్టిక్ 4కే 43 శాతం తగ్గింపుతో రూ.3,999కు లభించనుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇన్‌బిల్ట్ ఫైర్ టీవీతో కూడిన స్మార్ట్ టెలివిజన్‌ను 50 శాతం రాయితీపై కొనుగోలు చేయొచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్ మరెన్నో :
