తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట:
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లోని పీవీ ఘాట్ లో పూర్వ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గౌరవ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పీవీ నరసింహారావు సంస్కరణలు అమలు చేయకపోయుంటే దేశం ఇవాళ ఈ స్థితిలో ఉండేది కాదన్నారు. భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం పివి చరిత్ర నిలిచి ఉంటుందన్నారు. పీవీ నరసింహారావు గొప్ప సంస్కరణల శీలి అన్నారు.ఆయన మేధావి కాబట్టే అద్భుతమైన పాలన అందించారన్నారు.స్థిత ప్రజ్ఞుడు బహుభాషా కోవిదుడు నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పూర్వ ప్రధాని పివి నరసింహరావు ఆశయాలు సాధించాలన్నారు.