తెలంగాణ వీణ,హైదరాబాద్:రణించి, 9 మంది గల్లంతయ్యారు. గురువారానికి మృతుల సంఖ్య 9 కి పెరిగింది.
కన్నడిగుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చే విషయంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మంత్రి కృష్ణబైరేగౌడ చర్చలు జరిపారు. గురువారం ఉదయం 11 గంటలకు 9 మృతదేహాలకు ఉత్తరకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. అక్కడి నుంచి విమానంలో డెహ్రాడూన్‌కు తరలించారు. అక్కడి నుంచి విమానంలో బెంగళూరుకు తరలించనున్నట్లు మంత్రి తెలిపారు.
మృతులు వీరే
మృతుల్లో ముగ్గురు పురుషులు, ఆరుమంది మహిళలు ఉన్నారు. ఇందులోనే మృతుడు సుధాకర్ (71) ఉన్నారు. ఆయనే కర్ణాటక మౌంటెనీరింగ్ సంఘం (కేఎంఏ)ని స్థాపించి తరచూ ఔత్సాహికులను హిమాయల పర్వతాల అధిరోహణకు తీసుకెళ్లేవారని తెలిసింది. మిగతా మృతుల వివరాలు.. సింధు వకీలం (44), సుజాత ముంగుర్‌వాడి (52), ఆమె భర్త వినాయక్.బి (52), చిత్రా ప్రణీత్ (48), కె.వెంకటేష్ ప్రసాద్ (53), కేపీ పద్మనాభ (50), అనితా రంగప్ప (55), పద్మిని హెగ్డే (34) ఉన్నారు. వీరందరూ బెంగళూరు వాసులే. తమవారు ఇక లేరని తెలిసి వారి పిల్లలు, జీవిత భాగస్వాములు తీవ్ర శోకంలో మునిగిపోయారు.