Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను

Must read

  • హైదరాబాదులోని లోటస్ పాండ్ వద్ద జగన్ నివాసం
  • ఫుట్ పాత్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు
  • రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు

తెలంగాణవీణ…హైదరాబాద్:హైదరాబాదు లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన ఈ సెక్యూరిటీ అవుట్ పోస్టు కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యకంగా కలిగిస్తున్నాయని, ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి, జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. కాగా, జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you