తెలంగాణ వీణ తెలంగాణ:తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పవర్ కమిషన్ మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్‌కు అందిన సమాచారంపై తమ అభిప్రాయం చెప్పాలని పవర్ కమిషన్ తన నోటీసుల్లో కేసీఆర్‌కు స్పష్టం చేసింది. జూన్ 27వ తేదీ లోపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని సదరు నోటీసుల్లో మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించింది. అలాగే ఇదే అంశంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డితోపాటు మరికొంత మందికి సైతం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.