తెలంగాణ వీణ,శామీర్ పేట : కబ్జా కోరుల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని అలియాబాద్ గ్రామ ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు జిల్లా శామీర్ పేట్ తహసీల్దార్, అలియాబాద్ ప్రత్తేక అధికారి యాదగిరి రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీటీసీ మాట్లాడుతూ అలియాబాద్ గ్రామ రెవెన్యూ పరిధిలోని రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 12 ఎకరాల స్థలాన్ని ఒక వ్యక్తి కబ్జా చేసి కొన్ని సంవత్సరాల తరబడి అనుభవిస్తుండని ఆరోపించారు. ఈ విషయం పై పలు మార్లు రెవెన్యూ, మండల స్థాయి అధికారులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. అయిన ఆ కబ్జా కోరు చరనుండి ప్రభుత్వ భూమికి రక్షణ దొరకలేదాన్నారు. ఎప్పటికైనా ఆ భూమిని కబ్జా చెర నుండి విడిపించి పేద ప్రజలకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని కోరారు. దయచేసి ఈ విషయం పై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.