తెలంగాణ వీణ,మేడ్చల్ జిల్లా : విరివిగా మొక్కలు నాటడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ నిషేధం, చెట్ల నరికివేత, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంతో పర్యావరణ పరిరక్షణ చేయవచ్చునని పోలీస్ అధికారులు వెంకట్ రావు పరమేశ్వరి అన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మొక్కలు పంపిణి చేశారు. కిచన్ గార్డెన్, మొక్కలు పెంచడం, నీటిని సంరక్షించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముడుచింతలపల్లి మండలంలో అధికారులు, ప్రజా ప్రతి నిధులు పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అద్రాస్ పల్లి, కేశ్వాపూర్ గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సంతోషి, కామేశ్వరి, అరుణ, మ్యాజిక్ బస్ స్టాప్ డిపిఎం సాగర్, టిఎంఓ లావణ్య, యూత్ మెంటర్స్ రెహణ, కీర్తి, లక్ష్మీ, భవాణి, శైలజ, భింది, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.