తెలంగాణ వీణ/ తార్నాక: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4.వ సారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యఅతిథిలు గా టిటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నన్నూరి నర్సిరెడ్డి, CBN ఫ్యాన్స్ అద్యక్షుడు తలారి శ్రీనివాస్ తార్నాక డివిజన్ అధ్యక్షులు గండికోట విజయ్ కుమార్ విచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ బాణాసంచ కాలుస్తూ జై తెలుగుదేశం , జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేస్తూ ఓరెత్తించారు..
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు తార్నాక డివిజన్ అధ్యక్షులు గండి కోటవిజయ్ కుమార్ , మెట్టుగూడ డివిజన్ అధ్యక్షులు తడకవినోద్ కుమార్. అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షులు ఖాతా విజయకుమార్, బౌద్ధనగర్ గరిగే ప్రవీణ్ కుమార్ రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు నాలు బంధు శ్రీనివాస్ రాష్ట్ర sc సెల్ ,.బండి మురళీకృష్ణ , శివ, .రమేష్, కార్యదర్శి బొట్టు సురేష్ టి.రాము, శ్యామ్, వెంకట స్వామి , శంకర్ ,విక్రమ్, సుధాకర్ , నాని తదితరులు పాల్గొన్నారు.