Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తైక్వాండో కూడా విద్యలో ఒక భాగమే: కొత్తపల్లి తిరుపతి

Must read

తెలంగాణ వీణ/ఓయూ: ఆత్మ రక్షణకు తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ చక్కటి సాధనమని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. వై జి టి ఏ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో తైక్వాండో బెల్టు ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓయూ జేసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి, బిఎస్ఎఫ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పులిగంటి వేణుగోపాల్, వై జి టి ఏ జనరల్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యం, బిఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు అంబేద్కర్ హాజరయ్యారు. వై జి టి ఏ తైక్వాండో సీనియర్ మాస్టర్ విశ్వనాధ్ ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడలో తైక్వాండో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్ మరియు బెల్ట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో శిక్షణ పొందితే వారికి రక్షణ మరియు దేహదారిద్యానికి, ఆరోగ్యానికి దోహదపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఒక క్లాసును తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ కి కూడా కేటాయించేలాగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై జి టి ఏ అకాడమీ మాస్టర్స్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you