తెలంగాణ వీణ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, జగదల్‌పూర్‌కు జిల్లాలకు చెందిన డీఆర్జీ ఐటీబీపి 45 వ బెటాలియన్ కు భద్రతా బలగాలు సంయుక్తంగా తూర్పు బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య పలుమార్లు ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా పోలీసు స్టేషన్ పరిధిలో గల తుల్తులి_గోబెల్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం ఘటనా స్థలం లో యూనిఫాం ధరించిన ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు.ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలు,ఆరు తుపాకులు , ఇతర సామగ్రి తో పాటునక్సల్స్ మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఎన్ కౌంటర్ లో నారాయణపూర్ జిల్లా కు చెందిన ముగ్గురు సైనికులు గాయపడినట్లు దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.గాయపడిన సైనికుల పరిస్థితి సాధారణంగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.మృతుల గుర్తింపు