- రేపు న్యూయార్క్‌లో దాయాదుల ఫైట్
- నిన్న ప్రాక్టీస్‌లో రోహిత్ చేతికి గాయం
- చికిత్స అనంతరం తిరిగి బ్యాటింగ్
- ఊపిరి పీల్చుకున్న అభిమానులు, జట్టు సభ్యులు
తెలంగాణ వీణ ..భారతదేశం:టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ప్రాక్టీస్‌లో టీమిండియా సారథి రోహిత్‌శర్మ చేతికి గాయమైంది. అయితే, ఆ తర్వాత కూడా అతడు బ్యాటింగ్ కొనసాగించడంతో ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ బౌలర్ వేసిన బంతి రోహిత్ చేతి వేళ్లకు బలంగా తాకింది. దీంతో ప్రాక్టీస్‌కు కాసేపు బ్రేక్ పడింది. వెంటనే రంగంలోకి దిగిన ఫిజియోలు వైద్యం చేశారు. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ మళ్లీ రోహిత్ యథావిధిగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ గాయపడడం ఇది రెండోసారి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ సెంచరీ తర్వాత గాయపడడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కాగా, నిన్న టీమిండియా ఆటగాళ్లు న్యూయార్క్‌లోని స్టేడియంలో నాలుగు గంటలపాటు ప్రాక్టీస్ చేశారు.