తెలంగాణ వీణ, హైదరాబాద్ :ఎన్నికల ఫలితాలను చూసి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్లేటు మార్చారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, నారాలోకేశ్, జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అప్పటివరకూ విమర్శలు చేసిన ఆర్జీవీ ఇలా మారిపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.