తెలంగాణ వీణ/ఓయూ: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రెండు వేల కోట్లు కేటాయించి ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించటాన్ని హర్షిస్తూ గురువారం మధ్యాహ్నం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో ఓయూలో ఉన్న జామై ఉస్మానియా పాఠశాలలో పాఠశాల విద్యార్థులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయనున్నట్లు మానవతారాయ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేసి రాష్ట్ర కన్వీనర్ మేడారపు సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్ గౌడ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్ల నాగరాజు, ఓయూ నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంటి మణికంఠ, ఓయూ జేఏసీ నాయకులు పుల్లగిరి అశోక్, మామిడి విజయ్, మేక శ్రీకాంత్,గ్రేటర్ హైదరాబాద్ నిరుద్యోగజేసి నాయకులు హేమంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.