- ఆదివారం సినిమా షూటింగ్ లు బంద్
- నిర్మాతల మండలి ప్రకటన
- ఫిల్మ్ సిటీలో రామోజీ పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు
తెలంగాణ వీణ ..భారతదేశం:రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు అని వ్యాఖ్యానించారు. మీడియా సహా పలు రంగాల్లో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి, ప్రజలకు సేవ చేసిన ఆ మహానీయుడికి నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహాన్ని కడసారి చూసి, నివాళులు అర్పించారు. ప్రముఖ నటులు మోహన్ బాబు, నరేశ్, కల్యాణ్ రామ్, సాయికుమార్, దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కీరవాణి తదితరులు ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు.కాగా, రామోజీరావు మరణంపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విచారం వ్యక్తం చేసింది. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ సంతాపం ప్రకటించింది. రామోజీరావు మృతికి సంతాపంగా ఆదివారం సినిమా షూటింగ్ లు అన్నీ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల మండలి శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది