- సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
- నేడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ
- దాదాపు 8 వేల మంది అతిథుల నడుమ ప్రమాణస్వీకారం
తెలంగాణ వీణ..భారతదేశం:వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. వారిలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రజనీకాంత్ ను మీడియాతో పలకరించింది. తాను మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నానని వెల్లడించారు. ఇది చారిత్రాత్మక ఘట్టం అని రజనీకాంత్ అభివర్ణించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్న నరేంద్ర మోదీ గారిని అభినందిస్తున్నానని తెలిపారు.