- తీవ్ర అనారోగ్యంతో రామోజీరావుకు కన్నుమూత
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన రజనీకాంత్
- రాజకీయాల్లో గొప్ప కింగ్ మేకర్ అని కితాబు
తెలంగాణ వీణ..భారతదేశం:రామోజీరావు మృతి పట్ల దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. నా గురువు, నా శ్రేయోభిలాషి రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాను అని వెల్లడించారు. పాత్రికేయ రంగంలో, సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీ రావు అని కొనియాడారు. రాజకీయాల్లో గొప్ప కింగ్ మేకర్ అనిపించుకున్నారని కీర్తించారు. తన జీవితంలో రామోజీరావుకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన నాకు మార్గదర్శకుడు, నాకు స్ఫూర్తి ప్రదాత అని రజనీకాంత్ వివరించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.