తెలంగాణ వీణ/ఓయూ: భారత్ జోడోయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి బిఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పులిగంటి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. బిజెపి కేంద్రంలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పిన నేతలకు సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా బిజెపికి దేశ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
