Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు

Must read

  • రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో హాజరవుతున్న ఖర్గే
  • ఇండియా కూటమి కీలక నేతలతో చర్చల అనంతరం నిర్ణయం
  • కార్యక్రమానికి తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరు?

తెలంగాణ వీణ..భారతదేశం:నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.ఇండియా కూటమిలోని కీలక నేతలతో చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you