- ఇతర దేశాల్లో మన నగరాల పేర్లు
- అక్కడ కూడా అవే పేర్లతో ఫేమస్
- భారతీయులతో ఏమాత్రం సంబంధం లేని ప్రాంతాల్లోనూ మన పేర్లు
తెలంగాణవీణ,హైదరాబాద్ఊ..మన ఊరి పేరు మన పొరుగునే ఉన్న జిల్లాలోనో, ఇంకో చోటో ఉండడం సర్వసాధారణమైన విషయం. ఉదాహరణకు తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రమైతే.. సిద్దిపేటలో అదే పేరుతో మండల కేంద్రం ఉంది. ఇక, రామచంద్రపురం అనే పేరుతో చాలా చోట్ల గ్రామాలు ఉన్నాయి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అయితే మన దేశంలోని ప్రముఖ పట్టణాలు, పర్యాటక కేంద్రాల పేర్లు ఇతర దేశాల్లోనూ ఉంటే.. అవి కూడా అక్కడ ఫేమస్ అయితే! వినడానికి కాస్తంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దేశ రాజధాని ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్ వంటి పేర్లతో ఇతర దేశాల్లోనూ పట్టణాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటితో భారతీయులకు సంబంధం ఉంటే.. మరికొన్ని ఎలాంటి సంబంధం లేకుండానే ఫేమస్ అయ్యాయి. మరి అవి ఏయే దేశాల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ వీడియో చూసేయండి.