తెలంగాణవీణ, హైదరాబాద్ : తోటి స్నేహితుడి కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేసి కుటుంబానికి తనతో చదువుకున్న పూర్వపు విద్యార్థులు బాటగా నిలిచారు. శామీర్ పేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన సత్యనారాయణ శామీర్ పేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 విద్యా సంవత్సరంలో 10వ తరగతిని పూర్తి చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బదపడుతున్న సత్యనారాయణ మే నెల 22వ తేదిన మృతి చెందాడు. తమతో చదువుకున్న స్నేహితుడు చనిపోయాడని తెలుసుకున్న పూర్వపు విద్యార్థులు స్నేహితుడి కుటుంబానికి బాసటగా నిలవాలనుకున్నారు. స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సాయంగా రూ.50 వేలను మృతుడి కుటుంబానికి అందజేశారు. అనంతరం మృతిచెందిన స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరలని నివాళులర్పించారు.