తెలంగాణవీణ జాతీయ:ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన తరుణంలో, కేజ్రీవాల్ న్యాయవాదులు దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనుకుంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్‌ని కోర్టులో విచారించి, ఆయనను అరెస్ట్ చేసేందుకు కావాల్సిన పత్రాలను రౌస్ ఎవెన్యూ కోర్టుకు సీబీఐకి అనుమతి ఇవ్వడంతో అరెస్ట్ జరిగింది.