- నిజంగానే ప్రధాని పదవిని ఆఫర్ చేస్తే తిరస్కరించవద్దని పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ సూచన
- పార్లమెంట్‌లో తాము విపక్షంగా వ్యవహరిస్తామన్న డీకే శివకుమార్
- ప్రజల తరఫున పోరాడుతామని వెల్లడి
తెలంగాణ వీణ..భారతదేశం:బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి ప్రధాని పదవి ఆఫర్ వస్తే తీసుకోవాల్సింది అని పూర్నియా నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన ఎంపీ పప్పు యాదవ్ అన్నారు. ఆయనకు నిజంగానే ఆ పదవిని ఇస్తామని చెప్పి ఉంటే తిరస్కరించవద్దని సూచించారు.
బాధ్యతాయుత విపక్షంగా వ్యహరిస్తాం: డీకే శివకుమార్
కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుత విపక్షంగా వ్యవహరిస్తుందని… ప్రజల తరఫున పోరాడుతామని ఆ పార్టీ నేత, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. బీజేపీ సొంతగా 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 100 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ సొంతగా మ్యాజిక్ ఫిగర్‌కు 32 సీట్ల దూరంలో నిలిచింది. ఎన్డీయే కూటమిలోని పార్టీలతో కలుపుకుంటే 292 సీట్లు దాటాయి. దీంతో మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… తాము విపక్షంలో కూర్చోవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల తరపున పోరాడతామన్నారు