తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో ఆ పార్టీ జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది రెండు సార్లే. 1985లో చివరిగా గెలిచింది. 2019లో ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను విపరీతంగా పెంచాయి.