తెలంగాణ వీణ..ముంబై:ఓ మహిళ ఆన్‌లైన్ యాప్ ద్వారా తినడానికి 3 ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ చేసింది. డెలివరీ అయిన వెంటనే ఆ మహిళ ఐస్ క్రీం ప్యాకింగ్ ఓపెన్ చేసింది. ఆమె దానిని తినబోతుండగా ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించడంతో షాక్ తింది. ఇది చూసిన ఆ మహిళ గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయింది. కొంచెం సేపటికి తేరుకున్న ఆ మహిళ మళ్ళీ ఐస్ క్రీం వైపు చూడడం మొదలు పెట్టింది. తాను మోసపోయానని భావించింది.. మళ్లీ ఐస్‌క్రీమ్‌ని చూసేసరికి అది 2 సెంటీమీటర్ల మనిషి వేలు అని అర్థమైంది.ప్రస్తుతం ఆన్ లైన్ లో రకరకాల ఆహారం ఆర్డర్ పెట్టుకునేవారు ఎక్కువ. అయితే తినే మందు మీకు తెచ్చిన ప్యాకెట్ లో ఏముందో ఒక్కసారి పరిశీలించండి. మీరు ఆర్డర్ పెట్టిన ఆహారంలో మార్పులు ఉండొచ్చు.. తాజాగా ఓ మహిళ ఆన్ లైన్ లో తినడానికి ఆహారాన్ని ఆర్డర్ పెట్టింది. తినడానికి ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో తెగిన మానవ అవయవం కనిపించింది. ఇది చూసినా.. ఆలోచించినా ఎవరికైనా గూస్‌బంప్‌లు వస్తాయి. అయితే ఈ ఘటన నిజంగా మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఓ డాక్టర్ ఆన్‌లైన్ యాప్ ద్వారా తినడానికి 3 ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ చేశారు. డెలివరీ అయిన వెంటనే ఆ డాక్టర్ ఐస్ క్రీం ప్యాకింగ్ ఓపెన్ చేసి దానిని తినబోతుండగా ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించడంతో షాక్ తిన్నారు.