తెలంగాణ వీణ మేడ్చల్ : బిజేపి ప్రభుత్వం చెప్పట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శామీర్ పేట్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ వార్డు సభ్యుడు మాజీ వైస్ ఎంపీపీ వంగరి హృదయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం బిజేపి పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ బలోపేతం తో పాటు లోకల్ బాడీస్ పై ఫోకస్ చేయాలన్నారు. బిఆర్ఎస్ SC సెల్ షామీర్పేట్ మండల్ వర్కింగ్ తాడేం కుమార్, మాజీ వార్డ్ మెంబర్ గణేష్తో పాటు 20 మంది కార్యకర్తలు పార్టీ లో చేరగా వారికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు వీరందరిని కండువా కప్పి బిజెపి పార్టీలోకిఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రం రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ, బిజెపి మండల అధ్యక్షులు కైరా యాదగిరి, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మల్యాల మహేష్, ఓబిసి మొర్చ మండల అధ్యక్షులు కొంగ బాలకృష్ణ, బిజెపి నాయకులు తుమ్మ వివేకానందు, అల్లం శ్రీనివాస్, ఇప్ప బ్రహ్మానంద రెడ్డి, చేరుకుల రాము యాదవ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు