Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలుగు మీడియా ప్ర‌పంచానికి ఆయ‌న‌ ఓ దార్శనికుడు..

Must read

  • రామోజీ రావు మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం
  • ఆయ‌న మరణవార్త తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేసింద‌న్న దీదీ 
  • ‘ఎక్స్’ వేదిక‌గా ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్య‌మంత్రి

తెలంగాణ వీణ ..ప్రపంచం:ఈనాడు సంస్థల అధినేత, తెలుగు మీడియా మొఘ‌ల్‌ రామోజీ రావు మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలిపారు. ఈ మేరకు రామోజీ రావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) లో ఓ పోస్టు పెట్టారు.”ఈనాడు గ్రూప్‌, ఈటీవీ నెట్‌వర్క్‌, ఫిల్మ్‌ సిటీ వ్యవస్థాపకులు రామోజీ రావు మరణవార్త తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేసింది. కమ్యూనికేషన్‌ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఆయన ఓ దార్శనికుడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మంచి పరిచయం ఉంది. ఓసారి ఫిల్మ్‌సిటీకి నన్ను ఆహ్వానించారు. ఫిల్మ్‌సిటీ సందర్శన మధురానుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభులాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని దీదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you