- బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు, బీజేపీ 12 సీట్లలో గెలుపు
- అదంతా వట్టి ప్రచారమేనన్న బీజేపీ
- టీఎంసీ వ్యాఖ్యల్లో నిజం లేదని వెల్లడి
తెలంగాణ వీణ,హైదరాబాద్:బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అయితే దీనిని బీజేపీ ఖండించింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు, బీజేపీ 12 సీట్లు గెలుచుకుంది. అయితే బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని తృణమూల్ తెలిపింది. ఈ ప్రచారంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. తృణమూల్ కాంగ్రెస్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది.బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఏడు దశల్లో జరిగింది. ఈసారి మమతా బెనర్జీకి బీజేపీ షాక్ ఇస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టీఎంసీ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ సీట్లు 2019 కంటే తగ్గాయి. అదే టీఎంసీ సీట్లు 22 నుంచి 29కి పెరిగాయి.