సమీక్ష సమావేశంలో అధికారులతో
ఎమ్మెల్యే..మాధవరం కృష్ణా రావు
తెలంగాణవీణ – కూకట్ పల్లి….కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్, బాలానగర్ వార్డు కార్యాలయంలో, స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మరియు అధికారులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ సమావేశంలో పలు కాలనీ వాసులు ఫిర్యాదులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,ప్రతి కాలనిలో ముఖ్యంగా డ్రైనేజీ, వాటర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కావున డ్రైనేజీ, మంచి నీళ్లు, శానిటేషన్ సమస్యలను త్వరగా పూర్తీ చేయాలనీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఇందిరానగర్ లోని అంబేద్కర్ భవనం త్వరగా పూర్తి చేసి ఈ నెల లోపే ప్రారంభోత్సవం చేయాలనీ అధికారులకు సూచించారు. అలాగే ఇంద్రా నగర్ లోని ప్రతి ఒక్కరు ఉచిత మంచి నీటి కనెక్షన్ కు దరఖాస్తు పట్టుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అసోసియేషన్ వాసులు, అధికారులు మరియు నాయకులూ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.