తెలంగాణవీణ-కూకట్ పల్లి….కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న యువతకు భవిష్యత్తులో గొప్ప అవకాశాలు కల్పిస్తూ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని అన్నారు శేరి సతీష్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో యువతను ప్రోత్సహిస్తూ కొత్త కమిటీల ఏర్పాటు సందర్భంగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆద్వర్యంలో పార్టీ కోసం,కష్ట పడుతున్న యువకులకు, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు, మరియూ కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సహకారంతో, కూకట్ పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కండి శ్రావణ్ తో చర్చించి , నియోజకవర్గ స్థాయి, మరియు డివిజన్ నూతన కమిటీ వేయడం జరిగింది,అందులో నియోజకవర్గం యువజన ప్రధాన కార్యదర్శులుగా జేరిపటి రాజు, ఎండీ రావుఫ్, యువజన కార్యదర్శిగా వినయ్ గౌడ్, యువజన సహాయ కార్యదర్శిగా హరి, ఫతేనగర్ డివిజన్ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేశ్ లను నూతనంగా నియమించారు, ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్ట పడుతున్న వారికి కాంగ్రెస్ పార్టీ లో మంచి అవకాశాలు కల్పిస్తు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న యువతను కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందనీ, అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యువతకు అండగా ఉంటుదని ఆయన గుర్తు చేశారు, అలాగే నియోజకవర్గంలో ఇంకా ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాబోయే రోజులో మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ , మైఖేల్ ,ఫణీంద్ర, మహిళ నాయకురాలు రజిత ,జోజమ్మ, కుమ్ము బాబు, లోగి రాజు, బాలానగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసన్న, సోనూ, రాజు, మరియూ స్థానిక నాయకులు పాల్గొన్నారు.