- త్వరలో జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికలు
- ఈ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌లు నియామకం
- దీనిలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలు
- హరియాణాకు ఇన్‌ఛార్జ్‌లుగా ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్
- మహారాష్ట్ర బాధ్యతలు భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్‌కు
తెలంగాణ వీణా భరతదేశం:త్వరలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. దీనిలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. అలాగే హరియాణాకు ఇన్‌ఛార్జ్‌లుగా ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్‌లను నియమించింది. మహారాష్ట్ర బాధ్యతలు భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్‌కు అప్పగించడం జరిగింది. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిస్వశర్మను ఝార్ఖండ్ ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.