తెలంగాణవీణ, కీసర : మహిళలు స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికాభివృద్ది సాధించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో ఎస్సీ కార్పొరేషన్, ప్రో ఫ్యాషన్ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణి చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని 70 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. మున్సిపల్ కు చెందిన మహిళలకు ఉచితంగా మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్ లను అందజేశారు. మహిళలు స్వయం కృషితో ఎదిగి ఇతరులకు ఉపాది అవకాశాలను కల్పించాలని సూచించారు. పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కమిషనర్ జి. రాజేంద్ర కుమార్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, అభయ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.