Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

హరిత తారామతి బారదారి రిసార్ట్ లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు

Must read

తెలంగాణ వీణ, అమరావతి :హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం

👉రిసార్ట్ అంత కలియతిరిగిన మంత్రి జూపల్లి.

👉హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్ట్రారెంట్, పుష్పాంజలి ఆంఫి థియేటర్, ఆడిటోరియం, స్విమింగ్ ఫూల్, టాయిలెట్స్ ను పరిశీలించారు

👉హరిత రిసార్ట్ నిర్వహణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు

👉 ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని వెంటనే వాడి మరమ్మతులు చేపట్టాలని, చెత్త చెదారాన్ని తొలగించాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

👉ఉద్యోగులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు?, వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా? అని ఆరా తీశారు.

👉హరిత రిసార్ట్ నిర్వహణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

👉తారామతి బారదారి ప్రైమ్ లొకేషన్ లో విశాలమైన స్థలంలో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదు. దీనికి నిర్వహణలోపమే ప్రధాన కారణం.

👉ఆదాయం సరిగా లేదు. గతంలోపట్టించుకునే వారే లేరు. వివిధ స్థాయిల్లో సరైన నిర్ణయాలు తీసుకొని కారణంగా పర్యాటక శాఖ పరిధిలోని హరిత హోటల్స్ నిర్వహణ లోపభూష్టంగా తయారైంది.

👉ఎన్నికల కోడ్ కారణంగా పర్యాటక, ఎక్సైజ్ , సాంస్కృతిక శాఖలపై సమీక్షలు చేయలేకపోయాం. ఇప్పటినుంచి ప్రతీ నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతాం.

👉ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి పెడతాం. ఆహ్లాదకరమైన వాతారవణం ఉండేలా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దుతాం. ఇప్పటి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. మూడు, నాలుగు నెలల్లో వాటి రూపురేఖలను మారుస్తామని వివరించారు.

👉ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తాం. భవిష్యత్ లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

👉ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ నాయుడు, జీఎం (ప్రాజెక్ట్స్) ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you