తెలంగాణవీణ, హైదరాబాద్ : తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణలో రేపటి (సోమవారం) నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. అత్యవసరమైనవి మినహా అన్ని సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు వైద్యులకు రక్షణ, ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా గత రెండ్రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి జూడాలు నిరసనలు తెలుపుతున్నారు.