తెలంగాణవీణ –
కూకట్ పల్లి …. ముఖ్యమంత్రి సహాయనిది లో భాగంగా,ఎల్ ఓ సీ ని అందచేసిన కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, మరియు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ లోని రైల్వే ట్రాక్ వద్దగల గుడిసెలలో నివసిస్తున్న, సంగేపులా బక్కయ్య లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ అనారోగ్యానికి గురవడంతో, అతని కుమారుడు శ్రీకాంత్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు ని సంప్రదించగ, బండి రమేష్ ద్వారా వారిని నిమ్స్ హాస్పిటల్ కు పంపించి,చికిత్స నిమిత్తం ఎస్టిమేషన్ లెటర్ తెప్పించి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగ వారికీ రూపాయలు, ఒకలక్ష డెబ్భై అయిదు వేలు మంజూరు కావడంతో, ఆ చెక్కును బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బండి రమేష్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, శ్రీకాంత్, లలితా పాల్గొన్నారు