తెలంగాణ వీణ , జాతీయం ;ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు: ఈసీ
దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు.
ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు.
ఇది G7 దేశాలైన USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువన్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2కోట్ల మంది మహిళలు ఓట్లు వేసినట్లు ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్మెట్లో ఆయన వివరించారు.