తెలంగాణవీణ…హైదరాబాద్:ఈ నెల 17న బ్రకీద్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాలను దారి మళ్లించనున్నట్లు చెప్పారు.పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా అనుమతిస్తామని తెలిపారు. ప్రార్థనల నిమిత్తం వచ్చే వారి వాహనాల పార్కింగ్‌ను నెహ్రూ జులాజికల్ పార్క్, అల్లాహో అక్బర్ మసీదు ఎదుట ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాతబస్తీలో పలు మార్గాల్లో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు వివరించారు.