- ఎల్బీనగర్, వనస్థలిపురం, అబిడ్స్, అంబర్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం
- రోడ్లపై నిలిచిన నీరు… వాహనదారుల ఇబ్బందులు
- రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు
తెలంగాణ వీణ..హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో… రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, నాగోలు, గడ్డిఅన్నారం, దిల్ సుఖ్ నగర్, మలక్‌పేట, అబిడ్స్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.