తెలంగాణ వీణ/తార్నాక: తార్నాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో హరీష్ రావు అక్రమాలను బయట పెడుతున్న అని నన్ను చాలా ఇబ్బందులకు గురిచేసారని అన్నారు. నాపై అక్రమంగా పెట్టిన కేసులను తీసేయాలని ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు. రంగనాయక సాగర్ భూముల అవకతవకలపై పోరాడిన వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటికి పోలీసు వ్యవస్థ హరీష్ రావు చేతల్లోనే ఉందన్నారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తే హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అన్నారని గుర్తుచేశారు. రాజీనామా కాదు ఏం కాదు హరీష్ రావు బీజేపీ లోకి పోయే ప్రయత్నం చేస్తున్నాడని ఆ ప్రయత్నంలో భాగంగా మొదలు గంగుల కమలాకర్ ను బీజేపీ లోకి పంపిస్తున్నాడని ఆరోపించారు. ఫోమే ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీ లో పోయేందుకు కేంద్రంలో పెద్దలతో మంతనాలు జరుపుతున్నాడని అన్నారు.