తెలంగాణ వీణ/ తార్నాక: తెలుగు అరోమాస్ పేరుతో తార్నాకలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యాని, పులావ్ కేంద్రాన్ని మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ నగరం నిలుస్తుంది అన్నారు.
తెలుగు రుచిలతో బిర్యానీ, పులావ్ నాన్ వెజ్ వంటకాలను తార్నాక వాసులకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమని అన్నారు. హోటల్ నిర్వహణలో సుచి శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా కార్తిక రెడ్డి నిర్వాహకులకు సూచించారు. అనంతరం స్వయంగా ఆమె వంటకాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బండ చంద్రారెడ్డి , వీరన్న, సంపత్, సాయినాథ్ గౌడ్, కిరణ్ గౌడ్, శివారెడ్డి, నిర్వాహకులు పాశం అరవింద్, శ్రావణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ రాజు తదితరులు ఉన్నారు