తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సందర్శించారు.
అక్కడి ప్రజలు డ్రైనేజీ సమస్య తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమాచారం తో నిలిచి పోయిన నీటి కాలువ లను పరిశీలించారు.కాలువ నీరు బయట కు వెళ్ళేందుకు వెంటనే చర్యలు తీసుకొని డబుల్ బెడ్రూం వద్ద నివసిస్తున్న ప్రజల సమస్యను పరిష్కరించాలని అక్కడి మున్సిపల్ కమిషనర్,కు ఎమ్మార్వో కు ఆదేశాలు ఇచ్చారు.